8 సంవత్సరాలలో 250 ఉపగ్రహాలు పంపిన రష్యా

రష్యాకు చెందిన అంతరిక్ష సైనిక బలగాలు గడచిన ఎనిమిది సంవత్సరాలలో దాదాపు రెండువందలకుపైగా అంతరిక్ష వాహనాలను పంపించడం జరిగింది. వీటి ద్వారా 250కిపైగా ఉపగ్రాహాలను వివిధ కక్ష్యల్లోకి పంపడం జరిగింది.

1957వ సంవత్సరంలో ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్షయానాన్ని పంపించిన నేపథ్యంలో అంతరిక్ష సైనిక బలనిరూపణ దినోత్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో ఆదివారంనాడు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమంలో అంతరిక్ష సైనికబలగాల కమాండర్ మేజర్ జనరల్ ఓలేగ్ ఓస్తాపేంకో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం చాలా ఉత్తమమైన పని అని ఆయన తెలిపారు.

ఆర్థికంగా, సైనిక బలగాల సామర్థ్యం, సామాజిక క్షేత్రంలో అంతరిక్ష పరిశోధనలు పెంచుకునే ఉద్దేశ్యంతోనే ప్రపంచంలోనే తొలిసారిగా తాము ఉపగ్రహాన్ని పంపామని ఆయన పేర్కొన్నారు.

గడచిన ఎనిమిది సంవత్సరాలలో దాదాపు రెండువందలకుపైగా అంతరిక్ష వాహనాలను పంపించడం జరిగింది. వీటి ద్వారా 250కిపైగా ఉపగ్రాహాలను వివిధ కక్ష్యల్లోకి పంపడం జరిగిందని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి