ఈ క్రమంలో జనాల్ని చూస్తేనే మూగ జీవులు జడుసుకుంటున్నాయి. జూల్లో, పార్కుల్లో మూగజీవులు జనాలొస్తున్నారని తెలిస్తేనే పారిపోతున్నాయి. ఇదే తరహాలో జనాన్ని చూసిన ఓ మేక భయంతో పారిపోయి... సముద్రంలో దూకేసింది. ఈ ఘటన అలస్కాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అలస్కాలోని సీవార్డ్ అనే ప్రాంతంలో ఉండే మౌంటెన్ గోట్స్ చూసేందుకు ప్రత్యేకంగా అందంగా కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన వారంతా ఆ మేకలతో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతున్నారు. ఈ క్రమంలో గత శనివారం కూడా ఓ మేకతో చాలామంది బలవంతంగా సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు.