సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఫుడ్ అలెర్జీ అరుదైన ఫైబ్రోమయాల్జియా వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పారు. గతంలో సినీ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు పూనమ్ కౌర్‌లను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కలిసి, ఆయనకు ఓ చిత్రపటాన్ని కూడా బహుకరించారు.
అయితే, చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమంలో కనిపించిన పూనమ్ కౌర్.. కాస్త బొద్దుగా, ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా కనిపించారు. దీంతో ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలైన చర్చ సాగుతోంది.
ఈ వార్తల నేపథ్యంలో తన ఆరోగ్యం గురించి ఆమె స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం అంత బాగా లేదని, ఫుడ్ అలెర్జీతో బాధపడుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పూమమ్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సమస్యల కారణంగానే తాను బొద్దుగా కనిపిస్తున్నట్టు తెలిపారు. పూనమ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.