చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

దేవీ

సోమవారం, 19 మే 2025 (11:51 IST)
Cm Revanthreddy, Porata samiti
చిత్రపురి కాలనీలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాలనీ పోరాట నాయకులు విన్నవించారు. తెలుగు సినీ వర్కర్స్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చిత్రపురికాలనీలో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ భూమిలో సొసైటీ కమిటీ సంక్షేమం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని పిటీషన్ లో పేర్కొన్నారు. సి.ఎం.ను కలిసిన వారిలో కస్తూరి శ్రీనివాస్, మద్దినేని రమేష్, కాదంబరి కిరణ్, రవీంద్రనాథ్ ఠాగూర్,ఉదయ్ చౌదరి వున్నారు.
 
గత కొన్నేళ్ళుగా చిత్రపురిలో కోట్లాదిరూపాయల అవినీతికి ప్రస్తుత కమిటీ పాల్పడిందని దానిపై కోర్టులో కేసు కూడా కొనసాగుతుంది.  కొన్నాళ్ళ పాటు అధ్యక్షుడు అనిల్ జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత 50 కమీషన్ ఏర్పాటు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోమటిరెడ్డి వంటివారు కూడా కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేని పోరాట సమితి నాయకులు పేర్కొంటున్నారు. 
 
మరోవైపు పాత సొసైటీ కార్యాలయం స్థానంలో ట్విన్ టవర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం  చేస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదికను సి.ఎం. ద్రుష్టికి తెచ్చామని వారు పేర్కొన్నారు. ట్విన్ టవర్స్ అనేది పర్మిషన్ లేకుండా ఇప్పటికే పలువురి దగ్గరనుంచి కోట్ల రూపాయలు సొసైటీ కార్యవర్గం తీసుకుంది. దానిపై పోరాట సమితి కోర్టులో కేసు వేసింది. ఆ తర్వాత కొద్దికాలం ఆగిపోయింది. మరలా ఫిలింఛాంబర్ లోని అన్ని శాఖల ప్రతిధులతో వల్లభనేని అనిల్ సమావేశమయి ట్విన్ టవర్స్ అనేవి కార్మికులకు ఉపయోగపడతాయనీ, ఇల్లు లేనివారికి ఇల్లు వస్తాయని ఇటీవలే సమావేశంలో పేర్కొన్నారు. అయితే కార్మికులు కోట్లు వెచ్చించి కట్టలేరనీ, వారి పేరుతో బయటి వ్యక్తులకు అమ్మకుంటున్నారని సదరు పోరాట సమితి విమర్శిస్తోంది. మరి చిత్రపురి సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు