మాన్ హటన్ పేలుడు.. ఉగ్రవాద చర్య కాదా..? విధుల్లో లేని అధికారి దుండగుడిని కాల్చి చంపాడా?

మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (16:26 IST)
నేడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న పెనుభూతం ఉగ్రవాదం. ఏదైనా ఒక సంస్థగానీ, సమూహంగానీ తమ లక్ష్య సాధన కోసం క్రమపద్ధతిలో హింసాయుత విధానాలకు పాల్పడటం ఉగ్రవాదం. ఇక అగ్రరాజ్యాలలో పేరు గాంచిన అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసిన మానవ బాంబులు, మరోవైపు పేలుడు ఘటనలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. 
 
ఇటీవలే మాన్ హటన్‌లో పేలుడు జరిగిన సమయంలో మిన్నెసొటాలో ఓ దుండగుడు అల్లాహ్ నినాదం చేస్తూ ఓ షాపింగ్ మాల్‌లో దూరి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దొరికిన వారిని దొరికినట్టుగా వారిపై దాడికి పాల్పడ్డాడు. అతడి దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆ రాక్షసుడు కత్తితో పొడిచే ముందు మీరు ముస్లింలా అని బాధితులను ప్రశ్నించాడని పోలీసులు చెబుతున్నారు. 
 
అయితే కత్తితో రెచ్చిపోతున్న దుండగుడిని విధుల్లో లేని ఓ పోలీసు అధికారి కాల్చిచంపాడు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానించడం లేదని, అయినప్పటికీ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 
 

వెబ్దునియా పై చదవండి