చైనాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తున్నది. అంతుచిక్కని ఆ వైరస్ ప్రబలుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ముందుగా ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఆ కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
మిస్టరీ వైరస్‌కు చెందిన కేసులను సుమారు 45 ల్యాబ్‌లలో ద్రువీకరించారు. దాదాపు 1700 మందికి కొత్త వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు వుహన్ సిటీలో ఇద్దరు మృతిచెందారు.
లండన్‌కు చెందిన కాలేజీ ఆ కొత్త వైరస్ పై పరిశోధనలు నిర్వహిస్తున్నది. వుహన్ సిటీ నుంచి వస్తున్న ప్రయాణికులను సింగపూర్, హాంగ్‌కాంగ్ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్‌కో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చెకింగ్ చేస్తున్నారు. కొత్త వైరస్‌ను కొరోనా వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఈ వైరస్ వల్ల సాధారణ జలబు వస్తుంది. కానీ ఆ తర్వాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొరోనా వైరస్ దాదాపు సార్స్ వైరస్‌కు దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ వల్ల తొందరగా నిమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి.