ఆరేళ్ల బాలుడు జిప్‌లైన్‌లో వెళ్తూ 40 అడుగుల ఎత్తు నుంచి..?

శనివారం, 1 జులై 2023 (14:36 IST)
Boy
ఆరేళ్ల బాలుడు జిప్‌లైన్‌లో వెళ్తూ 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. జూన్ 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
పార్క్ ఫండిడోరాకి సంబంధించిన అమెజోనియన్ యాత్రలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో ఆ బాలుడు బయటపడ్డాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో జిప్‌లైన్‌లో వెళ్తున్న చిన్నారి.. కొంత దూరం వెళ్లాక.. జారి పడిపోవడాన్ని గమనించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు