ఇరాక్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ యేడాది ఏప్రిల్ నెలలో వ్యాపార పనుల కోసం షార్జా వెళ్ళాడు. అక్కడ అతినికి స్వీడిష్ విద్యార్థినంటూ ఓ మహిళ ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పరచుకుంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య చనువు పెరగడంతో పర్సనల్‌గా కలుద్దామని అతడికి ఆ మహిళ ఆఫర్ ఇచ్చింది. దీంతో దుబాయ్‌లో ఆమెను కలిసి అక్కడి నుంచి షార్జా వెళదామని ప్లాన్ చేసుకున్న వ్యాపారవేత్త ఇరాక్ నుంచి భారీగా నగదు తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు.
ఇరాక్‌కు చెందిన వ్యాపారవేత్తను రొమాన్స్ పేరుతో ఆకర్షించిన ఓ మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి అతడిని దోచుకుంది. కొద్దిరోజుల పాటు అతడితో చాట్ చేసిన మహిళ తన ఫ్లాట్‌లో ఎవరూ లేరని.. నువ్వు వస్తే స్వర్గాన్ని చూపిస్తానంటూ ఊరించే మాటలు చెప్పింది. దీంతో అతను ఎంతో ఆశతో అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడ ఐదుగురు నైజీరియన్స్‌ను వెంటబెట్టుకుని అతనికి చుక్కలు చూపించారు.