గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీ.. మృతి చెందిన మహిళ

ఆదివారం, 5 జనవరి 2020 (12:53 IST)
బజ్జీలు తినడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అవును  బజ్జీని ఆత్రుతగా తినబోయిన ఓ మహిళ ఆ బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కామరాజర్ నగర్‌లో పద్మావతి, గంగాధర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమై 11 సంవత్సరాలైనా ఈ జంటకు పిల్లలు లేకపోవటంతో కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. 
 
పుట్టింట్లో తల్లితండ్రులతోనే ఉంటున్న క్రమంలో… పద్మావతి తల్లి బజ్జీలు వేస్తోంది. వట్టింట్లో బజ్జీలను చూసి పద్మావతి వేడి వేడి బజ్జీలను తింటుండగా గొంతులో ఇరుక్కొని కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా… ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు