దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు, దేశ సమగ్రత వంటి అంశాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా కూడా భారత్ బాటలో పయనించేలా ఉంది.
కాగా, చైనాకు చెందిన ముఖ్యమైన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించడాన్ని ఇటీవలే అమెరికా ప్రశంసించిన విషయం తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ చర్య దోహదపడుతుందని ఇటీవలే మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.