కరుడుగట్టిన ఉగ్రవాది, ఉత్తర ఆఫ్రికా అల్‌ఖైదా చీఫ్ అయిన అబ్దుల్ మాలిక్ కోసం ప్రెంచ్ సైన్యం ఏడేళ్లుగా గాలిస్తోంది. ఉత్తర మాలి, నైజర్, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న అబ్దుల్‌మాలిక్ ఉత్తర అల్జీరియాలో దాక్కున్నట్లు ఫ్రెంచ్ సైన్యం సమాచారం అందుకుంది.
దీంతో ఉత్తరమాలి, అల్జీరియా తదితర ప్రాంతాల్లో ఫ్రెంచ్ సైనికులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఉత్తర మాలిలో జరిగిన ఈ దాడిలో అబ్దుల్ మాలిక్ మరణించినట్లు ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ట్విటర్‌లో తెలిపారు.