మే 15వ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మార్కెట్ యార్డ్ లలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని దీంతో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జె.డి మురళి కృష్ణ, ఎ డి ఎ నరసింహారెడ్డి, ఏ ఈ ఓ రమేష్, పావని, తదితరులు పాల్గొన్నారు.