అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం, టేకాఫ్ అయిన కాసేపటికే పొలాల్లో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ప్రయాణీకుల్లో 257 మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.
విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని సహాయక సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు.. అధికారులు తెలిపారు. కానీ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.