నేపాల్‌ ఖాట్మండ్‌లో దగ్ధమైన విమానం.. 67మంది పరిస్థితి? మీనా బషరన్ కూడా?

సోమవారం, 12 మార్చి 2018 (15:32 IST)
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయంలోనే ఘోరం జరిగిపోయింది. ఖాట్మండ్ త్రిభువన్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో విమానం దగ్ధమైంది. 13 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఎయిర్ లైన్ విమానం ఢాకా నుంచి ఖాట్మండు వస్తుండగా ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానం దగ్ధమైంది. ఈ విమానంలో 78 మంది ప్రయాణీకులు వున్నారు. వీరిలో 13మంది కాపాడగలిగారు. 67మంది పరిస్థితిపై అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు.. షార్జా నుంచి టర్కీకి వెళుతున్న బొంబార్డియర్ టీసీ - టీఆర్బీ జెట్ విమానం, ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వతాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇటీవలే పెళ్లి నిశ్చయమైన టర్కీ యూత్ ఐకాన్ మీనా బషరన్ (28) సహా 11 మంది యువతులు దుర్మరణం పాలయ్యారు. బషరన్ బిజినెస్ గ్రూప్ వారసురాలిగా, చిన్న వయసులోనే వ్యాపార రంగంలో రాణించిన ఈమె ఐకాన్‌గా ఎదిగారు. 
 
టర్కీ యువతలో ఎంతో పేరు తెచ్చుకున్న మీనా బషరన్, తన స్నేహితురాళ్లకు బ్యాచిలర్ పార్టీని ఇచ్చేందుకు షార్జాను ఎంచుకున్నారు. పార్టీకి తర్వాత ఇస్తాంబుల్‌కు పయనం కాగా.. ఇరాన్ మీదుగా వెళ్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఇంకా విమానం కొండను ఢీకొనడంతో.. 11 మీనా బషరన్‌తో పాటు 11 మంది యువతులు ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు