జపనీయులు ఎక్కడపడితే అక్కడ కునుకుతీస్తారట.. ఇనెమురి అంటే ఏమిటి?

మంగళవారం, 3 జనవరి 2017 (12:58 IST)
మనదేశంలో ఇలా ఎవరైనా పనిచేస్తూనో, మీటింగ్‌ మధ్యలోనే, తరగతి గదిలోనూ నిద్రపోతే చిన్నచూపు చూస్తారు. కానీ జపనీయులను ఎక్కడపడితే అక్కడ కునుకుతీస్తారట. అయినా ఇనెమురిలో ఉన్నారని వదిలేస్తారట. ఇనెమురి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. జపానీయులు పనిరాక్షసులు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎంత పని చేస్తే.. అంత గొప్పవారనే భావన వారిలో నిలిచిపోయింది. 
 
అలాంటి జపనీయులు నిద్రకు అందరూ కోరుకునే సౌకర్యాలు కోరుకోరని పరిశోధనలో తేలింది. నిద్రంటే నాలుగు గోడల మధ్య పరుపుపై హాయిగా కాళ్లు చాపుకుని నిద్రపోవడం కాదు. షాపింగ్ చేస్తూ, నడుస్తూ, మెట్లెక్కుతూ, కుర్చీలో కూర్చుని.. ఇలా తీసే కునుకు వారికి సరిపోతుందని పరిశోధనలో తేలింది. దీనిని వారు 'ఇనెమురి' అంటారట. 
 
ప్రయాణంలో, క్లాసులో పాఠం వింటూ.. మీటింగ్‌లో భాగస్వామ్యమవుతూ జపనీయులు నిద్రపోతుంటారు. కానీ జపాన్‌లో మాత్రం 'రాత్రంతా నిద్రలేకుండా పని చేసి అలసిపోయాడు. 'ఇనెమురి'లో ఉన్నాడు' అనుకుంటారు. దీన్ని విశ్రాంతి తీసుకుంటూనే పనిలో పాల్గొనడం అంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుని, తన వంతు రాగానే క్రమశిక్షణతో పనిచేయడమని పరిశోధకులు అంటున్నారు. అదన్నమాట జపనీయుల నిద్ర కథ. 

వెబ్దునియా పై చదవండి