అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మరోమారు తుపాకులు గర్జించాయి. ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో పది మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం న్యూయార్క్ రాష్ట్రంలోని బఫె నగరంలో ఉన్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లోకి ఓ అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కాల్పుల ఘటనను తన హెల్మెట్‌కు అమర్చిన కెమెరా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సూపర్ మార్కెట్ ప్రాంగణంలోని చొరబడిన దుండగుడు అక్కడి వున్న వారిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత వెళ్ళిపోతూ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ విషయం హెల్మెట్‌కు అమర్చిన కెమెరా దృశ్యాల ద్వారా తెలుస్తుంది.