ఉక్రెయిన్ భవనాలపై రష్యా క్షిపణిదాడులు... 10 మంది మృత్యువాత

శుక్రవారం, 1 జులై 2022 (08:51 IST)
ఉక్రెయిన్ దేశంలో రష్యా దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేసిన రష్యా సైనికులు ఇపుడు ఆ దేశంలోని భవనాలపై క్షిపణిదాడులు జరుపుతున్నారు. తాజాగా ఒడెస్సాలోని ఓడరేవులో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో రష్యాన్ బలగాలు క్షిపణిదాడులు జరిపాయి. ఈ దాడుల్లో 10 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, ఈ క్షిపణిదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల సంఖ్యపై ఇంకా ఒక స్పష్టత రాలేదు.
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధానికి దిగింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ పట్ణాలపై బాంబులతో దాడులు చేస్తుంది. అయితే, వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐలాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహించుకున్నట్టు రష్యా ప్రటించింది. మరోవైపు, ఉక్రెయిన్‌లోని బహుళ అంతస్తు భవనాలపై రష్యా క్షిపణిదాలు చేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు