మూడు డిఫరెంట్ కంటెంట్ తో సిద్దమైన నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

చిత్రాసేన్

గురువారం, 9 అక్టోబరు 2025 (16:44 IST)
Vijay Pal Reddy
వానరా సెల్యూలాయిడ్ బ్యానర్ మీద వచ్చిన త్రిబాణధారి బార్బరిక్, బ్యూటీ వంటి చిత్రాలు వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ ప్రాజెక్టులతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు విజయ్ పాల్ రెడ్డి అడిదల. నిర్మాతగా మంచి చిత్రాల్ని ఆడియెన్స్‌కి అందించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ పాల్ రెడ్డ సరికొత్త ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు.
 
సినిమాల్ని కమర్షియల్‌గా చూడని నిర్మాతగా విజయ్ పాల్ రెడ్డి డిఫరెంట్ కంటెంట్‌లకు ఓకే చెబుతున్నారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ అంటూ సరికొత్త ప్రయోగం చేశారు. ‘బ్యూటీ’ అంటూ ప్రతీ అమ్మాయిని, ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టచ్ చేశారు. ఇక ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టుల్ని లైన్‌లో పెట్టారు. ఇందులో ఓ ప్రముఖ హీరోతో విజయ్ పాల్ రెడ్డి ఓ సినిమాను నిర్మిస్తున్నారు.
 
ఈ మూడు ప్రాజెక్టులు కూడా డిఫరెంట్ జానర్‌లో ఉండబోతోన్నాయని సమాచారం. ఇక ఈ డిఫరెంట్ కంటెంట్ స్టోరీల్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు రాబోతోన్నారు. ఇండస్ట్రీలో ఒక సినిమాను నిర్మించి రిలీజ్ చేయడమే గొప్ప విషయం అంటే.. విజయ్ పాల్ రెడ్డి వరుసగా రెండు చిత్రాల్ని విడుదల చేశారు. ఇక ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టుల్ని కూడా నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఈ మూడు ప్రాజెక్టుల్కి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు