నైజీరియాలో అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

మంగళవారం, 9 నవంబరు 2021 (17:45 IST)
ఆఫ్రికా దేశం నైజర్​లో జరిగిన రెండు వేర్వేరు దుర్ఘటనల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దేశంలోనే రెండో అతిపెద్ద నగరం మారాడిలోని ఓ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది పిల్లలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతులంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు చిన్నారులేనని అధికారులు తెలిపారు.
 
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పాఠశాలగడ్డితో నిర్మించిన పాఠశాలలోని మూడు తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే అదే నగరంలో బంగారు గని కూలి.. 18 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఇటీవల కనుగొన్న బంగారు గని తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు