పాకిస్థాన్‌లో ఘోరం... లోయలో పడిన బస్సు - 28 మంది మృతి

ఠాగూర్

బుధవారం, 29 మే 2024 (15:17 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ పట్టణం నుంచి ఉత్తరాలన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు కొండ ప్రాంతంలో మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు