డిగ్రీ పట్టా కోసం 8 మంది డూప్‌లు.. ఎంపీని సస్పెండ్ చేసిన వర్శిటీ!

మంగళవారం, 22 అక్టోబరు 2019 (14:56 IST)
బంగ్లాదేశ్ ఎంపీ చిక్కుల్లో పడ్డారు. డిగ్రీ పట్టా పుచ్చుకునేందుకు ఏకంగా ఎనిమిది మంది డూప్‌లను సిద్ధం చేసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఎంపీని విశ్వవిద్యాలయం బహిష్కరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంగ్లాదేశ్‌ అధికార పార్టీకి చెందిన ఎంపీ తమన్నా సుస్రత్, యూనివర్సిటీ పరీక్షలను తన తరపున రాయించేందుకు తనలాగే కనిపించే 8 మంది డూప్‌లను తయారు చేయించారు. వారితోనే పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా, సాక్ష్యాలతో సహా మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడంతో యూనివర్సిటీ యాజమాన్యం సుస్రత్‌ను బహిష్కరించింది. 
 
కాగా, అవామీ లీగ్‌ పార్టీకి చెందిన తమన్నా నుస్రత్‌ బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ విద్యను అభ్యసిస్తున్నారు. తాను రాయాల్సిన మొత్తం 13 సబ్జెకుల పరీక్షల కోసం తన మాదిరిగానే ఉన్న 8 మందిని ఆమె రంగంలోకి దించగా, నాగరిక్‌ టీవీ అనే చానెల్‌ విషయాన్ని బయటపెట్టింది. ఈ డూప్ మహిళలు పరీక్షలు రాస్తుంటే, ఎంపీ అనుచరులు కాపలాగా ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు