దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించారు. రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. అయితే దర్యాప్తు పూర్తి చేసి, తుది నిర్ణయం తీసుకునే లోపే గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు.
మరోవైపు, తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్, మిలిండా గేట్స్ ఈనెల తొలినాళ్లలో ప్రకటించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, వీరిద్దరూ కలిసి మిలిండా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థను నడుపుతున్నారు.