బ్రెజిల్‌లో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు 94 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్టు తెలుస్తుంది. జర్మన్ ప్రభావం అధికంగా ఉండే పెట్రోపొలిస్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున నివాస ప్రాంతాలపై వరదలు, మట్టి చరియలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ ఘటనపై ఇప్పటివరకు 94 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది.
ఈ విషయాన్ని రియో డి జనేరో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మరో 35 మంది ఆచూకీ తెలియడం లేదని పేర్కొంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. గల్లంతైన వారు మట్టి చరియల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.