మావోలు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి

ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:57 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కలహండిలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. కలహండిలో ఐదు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఈ నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. 
 
ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు పలు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్ (46) అనే వ్యక్తి భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ప్రముఖు పత్రికకు చెందిన జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. 
 
మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద మావోయిస్టులు ఓ చెట్టుకు అతకించిన పోస్టర్లు, బ్యానర్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ అమర్చిన ఈఐడీ బాంబు పేలి మరణించాడని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు