బ్రిటన్ ప్రధానికి ఎదురుదెబ్బ... విశ్వాస పరీక్ష తప్పనిసరి...

బుధవారం, 16 జనవరి 2019 (09:03 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పార్లమెంట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో ఆమె ఓటమిపాలయ్యారు. దీంతో థెరిసా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 
 
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని గతంలో నిర్ణయించారు. దీంతో బ్రిటన్ పార్లమెంట్‌లో ఓటింగ్‌తో కూడిన చర్చ జరిగింది. ఈ చర్చ, ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది ఓటు వేయగా, 202 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో థెరిసా మే ఓటమిపాలయ్యారు. 
 
బ్రెగ్జిట్ ఓటింగ్‌లో ఓటమితో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరిసా మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే 14 రోజుల్లోగా మెజార్టీ రాజకీయ పార్టీ విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. గడువులోగా విశ్వాస తీర్మానంలో మెజార్టీ రాజకీయ పార్టీ నెగ్గకపోతే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యంకానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు