బ్రిటన్ పార్లమెంట్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేసిన నిరసనకారులు

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:36 IST)
యూకే పార్లమెంట్‌లో బ్రెక్సిట్ డిబేట్‌లో ఎంపీల పాల్గొనడాన్ని నిరసిస్తూ కొంతమంది నిరసనకారులు అర్ధనగ్న ప్రదర్శన చేసారు. సోమవారం సాయంత్రం బ్రెక్సిట్ డిబేట్‌ను ఎంపీలు కొనసాగించడాన్ని నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసనకారుల సమూహం హౌస్ ఆఫ్ కామన్స్ వద్దనున్న పబ్లిక్ గ్యాలరీలోకి ప్రవేశించారు. 
 
ఎక్స్టిన్క్షన్ రెబెల్లియన్ సమూహం నుండి 11 మంది నిరసనకారులు కేవలం అండర్‌వేర్‌ను ధరించి, తన శరీరాలపై వాతావరణానికి సంబంధించిన నినాదాలను పెయింటింగ్ చేసుకుని నిరసన తెలియజేసారు.
 
ఆ నిరసనకారులు పబ్లిక్ గ్యాలరీలో నిలబడి వారి వెనుక భాగాన్ని ఎంపీలపైపు తిప్పారు. ఆ సన్నివేశాలను కళ్లారా చూసిన వారందరూ సిగ్గుతో తలదించుకున్నారు. గ్లోబల్ వార్మింగ్‌కి వ్యతిరేకంగా తన నిరసనను ఈ రూపంలో తెలియజేసామని నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు