డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఇక ఆధార్ అనుసంధానం.. ఎందుకంటే?
సోమవారం, 7 జనవరి 2019 (13:09 IST)
గ్యాస్, బ్యాంకు వంటి అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం తాజాగా డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
అతి త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్స్-ఆధార్ అనుసంధానానికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగిలో వున్నట్లు సమాచారం.
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిందితుడిని సులభంగా అరెస్ట్ చేసే వీలుంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని పక్షంలో నిందితుడు పక్క రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం వుంది.
అదే ఆధార్‌తో అనుసంధానం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ మరొకటి తీసుకోలేడని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఆధార్ అనుసంధానం ద్వారా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దు అవుతాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.