గుండెను కోసి..కూరగా వండి...ఎక్కడో తెలుసా?

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:36 IST)
పక్కింటి వారు నచ్చకపోతే గొడవ పెట్టుకుంటాం...లేదంటే మాట్లాడటం మానేస్తాం. కాని సదరు కీచకుడు ఏకంగా మహిళను హత్య చేసి ..ఆమె గుండెకాయను తీసుకువచ్చి..వంట చేసి..కుటుంబసభ్యులకు వడ్డివార్చాడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన అమెరికాలో జరిగింది.
 
స్థానిక మీడియా కథనం ప్రకారం లారెన్స్‌ పాల్‌ అండర్సన్‌ అనే వ్యక్తి ని ఓక్లాహోమాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పొరుగింట్లో ఉంటున్న మహిళను అతికిరాతకంగా హత్య చేసి...అమె గుండెను కోసి..తన అత్తగారింటికి తీసుకువచ్చి..బంగాళా దుంపతో కలిపి ..కూరను వండాడు. అనంతరం అత్తమామలకు తినేందుకు పెట్టాడు.

వారు తినేందుకు నిరాకరించడంతో అత్తమామలతో పాటు వాళ్ల నాలుగేళ్ల మనమరాలిని కూడా దాడి చేశాడు. ఇందులో మామ, మనవరాలు మృతి చెందగా..అత్తకు తీవ్రగాయాలయ్యాయి.

కాగా, ఇతగాడికి నేర చరిత్ర ఉంది. ఓ మర్డర్‌ కేసులో 2017లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడగా..మూడేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత...ఇటీవల క్షమాభిక్ష కింద విడుదలై...తిరిగి వచ్చి... ఈ దారుణానికి ఒడిగట్టాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు