చైనా ఈ కామర్స్ సైట్ తబావోలో ఉంచగా.. 4.6మీటర్ల భారీ విగ్రహం ధర రూ 44707 కాగా, చిన్న సైజులో 1.6 మీటర్ల విగ్రహం రూ 11,168 పలికింది. ట్రంప్ ప్రవచించిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదం స్ఫూర్తితో మేక్ యువర్ కంపెనీ గ్రేట్ ఎగైన్ అనే సందేశాన్ని ఇస్తూ తాను ఈ ఉత్పత్తిని రూపొందించానని ఫుజియన్ ప్రావియన్స్‌కు చెందిన సెల్లర్ తెలిపారు.
వినోదం కోసం ప్రజలు ట్రంప్ విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నారని తాను మొత్తం వంద విగ్రహాలు తయారుచేయగా ఇప్పటికే పలు విగ్రహాలు అమ్ముడుపోయాయని చెప్పారు. అహంకారంతో కూడిన ట్రంప్ శకం ముగిసినా ఆయనలా ఉండకూడదని తనకు తాను గుర్తుచేసుకునేందుకే తాను ఈ విగ్రహం సొంతం చేసుకున్నానని ఓ కొనుగోలుదారుడు పేర్కొనడం గమనార్హం.