మహిళా న్యాయవాదులకు తప్పని లైంగిక వేధింపులు!

గురువారం, 16 మే 2019 (12:34 IST)
ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళా న్యాయవాది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తమ సీనియర్లు, సహచర లాయర్ల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. న్యాయవాద వృత్తిలో లైంగిక వేధింపుల గురించి ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేను లండన్‌లోని ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్(ఐబీఏ) నిర్వహించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లోని సుమారు 7 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వే నివేదికను ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం న్యాయవాద వృత్తిలో కొనసాగే ప్రతి ముగ్గురిలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతన్నట్టు వెల్లడించింది. వీరిలో 75 శాతం మంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోవడం లేదట. 
 
లైంగిక వేధింపులు చేస్తున్న వాళ్ళు సీనియర్లు కావడం, చెబితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయం నేపథ్యంలో సగం మంది బాధితులు జరిగిన ఘటనపై నోరుమెదపట్లేదు. ఇక, న్యాయవాద వృత్తిలో ఉన్న పురుషుల్లోనూ దాదాపు 7 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీరిలో కొందరు తాము ఎదుర్కొంటున్న వేధింపులపై ఫిర్యాదు చేయడం లేదని వెల్లడైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు