కరోనా వైరస్ పుణ్యమాని ప్రపంచ స్తంభించిపోయింది. అంతర్జాతీయ సరిద్దులు మూతపడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వన్యప్రాణులు, మృగాలకు స్వాతంత్ర్యం వచ్చినంతగా స్వేచ్ఛగా వివహరిస్తున్నాయి. పైగా, వాహనరాకపోకలన్నీ బంద్ కావడంతో కాలుష్యం కూడా పూర్తిగా తగ్గిపోయింది
కారకోరంలో ఎక్కడ ఈ వీడియో తీశారో తెలియదుగానీ, ఆప్ఘనిస్తాన్‌లోని వఖాన్ కారిడార్ నుంచి అక్సాయిచిన్ వరకు 500 కిలోమీటర్ల పొడవులో కారకోరం రేంజ్ (కారకోరం పర్వతశ్రేణి) విస్తరించి ఉంటుంది అంటూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు.