క్వారంటైన్‌ నుంచి బయటకు వస్తే రూ.5 కోట్ల అపరాధం.. ఎక్కడ?

బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:53 IST)
కరోనా వైరస్ బారినపడిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే, చాలా మంది ఈ క్వారంటైన్లలో ఉండలేక బయటకు వెళ్లిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇంకొందరు వైద్య సిబ్బందిపై భౌతికదాడులకు దిగుతున్నారు. ఈ సంఘటనలపై కెనడా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, క్వారంటైన్ నుంచి బయటకు వచ్చేవారికి గరిష్టంగా రూ.5 కోట్లు అపరాధం విధించాలని నిర్ణయించింది. అలాగే, మూడేళ్లపాటు జైలుశిక్ష విధిస్తారు. 
 
కాగా, కరోనా బాధిత దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఈ వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా, కెనడా సర్కారు ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారెవరైనా 14 రోజులు బయట కనిపిస్తే భారతీయ కరెన్సీలో కనిష్టంగా రూ.2.50 కోట్ల నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల మేరకు అపరాధం విధిస్తారు. జైలు శిక్ష ఖాయం. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లల్లో ఉంటున్నారా లేదా అని చూసేందుకు కెనడా పబ్లిక్ ఏజెన్సీ, పోలీస్ శాఖకు ఆ వివరాలు అందజేస్తోంది. 
 
పోలీసులు ప్రతి 3 గంటలకు ఒకసారి ఆ ఇల్లు చెక్ చేసి వాళ్లు లోపల ఉన్నారా లేదా పరిశీలిస్తారు. ఒకవేళ ఇంట్లో లేకపోతే వారు ఎక్కడా ఉన్నా పట్టుకుని నేరుగా జైలుకు తీసుకెళ్తారు. అయితే, ఈ చట్టం గురించి విమానాశ్రయంలోనే అడుగు పెట్టగానే వివరించి కాగితం మీద అంగీకార పత్రం తీసుకున్న తర్వాతే ఇంటికి పంపిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు