ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లేటపుడు మాస్క్ ధరించేందుకు నిరాకరించిన ఓ కొడుకును దారుణంగా చంపేశాడో కుమారుడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతా నగరంలోని షోవాబజార్‌కు చెందిన 78 ఏళ్ల బన్సిధర్ మల్లిక్‌గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం..
షోవాబజార్‌కు బన్సిధర్ కుమారుడు శీర్షేందు మల్లిక్ (45) దివ్యాంగుడు. శనివారం అతడు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మాస్క్ ధరించాలని తండ్రి కోరాడు. అందుకు శీర్షేందు నిరాకరించడంతో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఓ గుడ్డముక్కతో కుమారుడి గొంతు బిగించాడు. ఫలితంగా ఊపిరి ఆడక శీర్షేందు ప్రాణాలు కోల్పోయాడు.