ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో భారతీయ పప్పు ధాన్యం శెనగపప్పుకు స్థానం లభించింది. చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్‌లో చోటు దక్కించుకుంది. తద్వారా పలు కొత్త పదాల్లో చనాదాల్‌కు కూడా చోటు సంపాదించుకుంది. త్రైమాసిక నవీకరణలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ 600కుపైగా కొత్త పదాలను సేకరించింది. అందులో చనాదాల్‌ను కూడా స్థానం లభించింది.
ఇంగ్లీష్‌ను మరింత విస్తృత పరిచేందుకు జనాల నోళ్లలో నానుతున్న పదాలకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చనాదాల్‌తోపాటు టెన్నిస్ సంబంధమైన ‘ఫోర్స్‌డ్ ఎర్రర్’, ఆరు గేముల స్కోరును తెలిపే ‘బేగల్’ను కూడా చేర్చింది. వీటితోపాటు ఫుట్‌లెస్, స్విమ్మర్, సన్ ఆఫ్ ఎ బ్యాచిలర్ పదాలకు కూడా ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో స్థానం దక్కింది.