తన పర్యటనలో చైనా ఒక అధికారిని నియమించాలని కోరారు. అప్పుడైనా తాను ఎక్కడ పర్యటిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో.. ఏం చేస్తున్నానో.. చైనా ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు. దలైలామా గురించి నిజం తెలుసుకోవాల్సిన హక్కు, అధికారం 135 కోట్ల చైనా ప్రజలపై ఉందన్నారు.
కేవలం తప్పుడు సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటున్నారని, నిజమేంటో తెలుసుకోవాలని చైనా ప్రజలకు సూచించారు. ఈ పర్యటన కేవలం మతానికి సంబంధిన విషయమని భారత్ చెబుతున్నప్పటికీ దీన్ని వక్రీకరించి మరింత క్లిష్టపరిస్థితులు ఏర్పడేలా చైనా ప్రవర్తిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.