చైనాలో పరిస్థితి అత్యంత దయనీంగా ఉంది. కరోనా వైరస్ ధాటికి అనేకమంది మృత్యువాతపడుతున్నారు. ప్రతిరోజూ అనేక వందల మందికి ఈ వైరస్ సోకుతోంది. దీంతో పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరోవైపు, కరోనా వైరస్ గురించి ఈ ప్రపంచానికి ముందే హెచ్చరించిన వైద్యుడు కూడా చివరకు ఆ వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఈ వార్త విన్న అనేక మంది తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ వైద్యుడు పేరు లీ వెన్‌లియాంగ్. వయసు 34 యేళ్లు. ఈయన కరోనా వైరస్ బారినపడి శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని ఆయన పనిచేసిన వుహాన్ సెంట్రల్ ఆసుపత్రి అధికారింగా వెల్లడించింది.