సోషల్ మీడియా పుణ్యంతో ఏ చిన్న సంఘటనైనా.. వీడియో రూపంలో దర్శనమిస్తోంది. తాజాగా ఓ కారును ఆటో మోసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చైనా మీడియా ట్విట్టర్లో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. చైనా, జెజియాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారు పాడవటంతో దాని పార్టుల్ని అమ్మేయాలనుకున్నాడు.
దీంతో దానిని ఓ చోటి నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఓ ఆటోను మాట్లాడుకుని దానిపై ఉంచి తీసుకెళ్లాడు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్‌కు 1300 యువాన్ల జరిమానా విధించారు. ఇక ఆటోపై కారును తీసుకెళ్లిన వీడియోపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. కారును మోసుకెళ్లిన ఆటో ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.