ఆప్ఘానిస్తాన్ పరిస్థితులపై పొరుగు దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశం బుధవారం (సెప్టెంబర్ 8, 2021) జరిగింది. చైనా, పాకిస్తాన్, ఇరాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు, అధికారులు మీటింగ్‌కు హాజరయ్యారు.
ఈ సదస్సులో పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. 220 మిలియన్ యువాన్ల సాయం ప్రకటన చేశారు. అప్ఘానిస్తాన్ అత్యవసర అవసరాలైన ఆహారం, ధాన్యం, టీకాలు, మందులు, చలికాలం వాడుకునేందుకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు ఈ నిధులు ఖర్చు చేస్తామన్నారు.