పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 22 మంది కార్మికులు మృతి

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:11 IST)
marble mine
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జియారత్ ఘర్ పర్వత శ్రేణుల్లో ఉన్న చలువరాతి గనులు కుప్పకూలాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 
 
శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు ఉండడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల్లో 12 మంది మైనర్లు ఉన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
 
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్ ఘర్ పర్వత శ్రేణులున్నాయి. ఈ శ్రేణుల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు