ఈ వ్యాక్సిన్ కు 'పికోవాక్' అని నామకరణం చేశారు. రీసస్ మకాకస్ అనే భారత సంతతి కోతులపై ఈ వ్యాక్సిన్ ను మొదటిగా ప్రయోగించారు. ఈ కోతులను కరోనా వైరస్ కు గురిచేసి, మూడు వారాల అనంతరం లక్షణాలు పూర్తిగా కనిపించాక వ్యాక్సిన్ ఇచ్చారు.
శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగానే, 'పికోవాక్' వ్యాక్సిన్ కోతుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది. ఆ మేరకు కోతుల వ్యాధి నిరోధక శక్తికి బలం చేకూర్చింది. ఈ ప్రయోగం ద్వారా మరో ఆసక్తికర అంశం కూడా వెల్లడైంది. వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కోతుల్లో తయారైన యాంటీబాడీలు కేవలం కరోనా వైరస్ నే కాదు, ఇతర సాధారణ వైరస్ లపైనా దాడికి దిగుతున్నట్టు గుర్తించారు.