చైనాలో వేల కొలది అశ్లీల వెబ్‌సైట్ల మూసివేత

ఆదివారం, 31 జనవరి 2021 (11:44 IST)
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుప్పలు తెప్పలుగా ఉన్న అశ్లీల వెబ్‌సైట్లను మూసివేసింది. అంతర్జాల సేవలను నియంత్రించే చైనా.. గతేడాది దాదాపు 18,489 వెబ్​సైట్లను మూసేసింది. మరో 4,551 వెబ్​సైట్లకు హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఆన్​లైన్​ విద్య పేరిట గేమ్స్​ను ప్రోత్సహిస్తూ, డేటింగ్​ మోసాలకు పాల్పడుతున్న కొన్ని వెబ్​సైట్లను గుర్తించినట్టు 'చైనా సైబర్​ స్పేస్​ విభాగం'(సీఏసీ) వెల్లడించింది. వీటితో పాటు అశ్లీల చిత్రాల వ్యాప్తి, హింసను ప్రేరేపించడం, అక్రమ వస్తు రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించినట్టు తెలిపింది. 
 
చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించే ఆన్​లైన్​ వేదికలను ప్రక్షాళన చేసేందుకు సీఏసీ చర్యలు చేపట్టిందని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వెబ్‌సైట్‌లను చైనా అణచివేస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు