ముగిసిన క్వారంటైన్.. ఇక వుహాన్‌లో కరోనా వైరస్ వేట... డబ్ల్యూహెచ్ఓ

గురువారం, 28 జనవరి 2021 (16:10 IST)
పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు తీసిన క‌రోనా మహ‌మ్మారి తొలుత చైనాలోని వుహాన్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ఈ వైరస్ సోకింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై ఆరా తీసేందుకు వూహాన్ నగరానికి చేరుకుంది. 
 
కానీ, కరోనా నిబంధనల కారణంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ క్వారంటైన్ గురువారంతో ముగిసిపోయింది. మొత్తం 13 మంది స‌భ్యులు డ‌బ్ల్యూహెచ్‌వో బృందం ఇక వుహాన్‌లో వైర‌స్ పుట్టుక‌పై స‌ర్వే చేయ‌నున్నారు. 
 
జ‌న‌వ‌రి 14వ తేదీన వుహాన్ చేరుకున్న శాస్త్ర‌వేత్త‌లు.. రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉన్నారు. ప్ర‌యితే ఆ వైర‌స్ పుట్టుకపై స్ట‌డీ చేసేందుకు వెళ్లిన డ‌బ్ల్యూహెచ్‌వో బృందం .. అక్క‌డి ప‌రిశోధ‌నా కేంద్రాలు, హాస్పిట‌ళ్లు, సీ ఫుడ్ మార్కెట్ల‌లో ప్ర‌జ‌ల్ని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు. 
 
అయితే చైనా అధికారులు ఇచ్చిన ఆధారాల ప్ర‌కార‌మే ప‌రిశోధ‌న జ‌ర‌గ‌నుంది. అంత‌ర్జాతీయ వైరాల‌జీ శాస్త్ర‌వేత్త‌ల అనుమ‌తి కోసం డ‌బ్ల్యూహెచ్‌వో, చైనా మ‌ధ్య ప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ త‌ర్వాతే సైంటిస్టుల‌కు వుహాన్ వెళ్లేందుకు అనుమ‌తి ద‌క్కింది. 
 
వుహాన్‌లో ఐసోలేష‌న్‌లో ఉన్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ‌శాస్త్ర‌వేత్త‌లు.. త‌రుచూ వీడియో కాల్స్ ద్వారా ఒక‌రికి ఒక‌రు ట‌చ్‌లో ఉన్నా‌రు. చైనా సైంటిస్టుల‌తోనూ డ‌బ్ల్యూహెచ్‌వో బృందం మాట్లాడింది. 
 
అయితే గురువారం రోజున క్వారెంటైన్ గ‌డువు ముగిసిన వెంట‌నే ఆ శాస్త్ర‌వేత్త‌లు స‌ర్వే కోసం బ‌స్సు ప్ర‌యాణం చేశారు. క్వారెంటైన్ ముగిసిన‌ట్లు ఆ శాస్త్ర‌వేత్త‌లు త‌మ ట్విట్ట‌ర్‌లో ద్రువ‌ప‌త్రాల‌ను పోస్టు చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు