వివరాల్లోకి వెళితే,, చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ ఛానెల్ ఒక ప్రకటన చేసింది. భారత్, చైనా రెండు దేశాల మధ్య ఒకవేళ యుద్ధమే గనుక వస్తే మోటరైజీ్ చేయబడిన తమ బలగాలు న్యూఢిల్లీని 48 గంటల్లో చేరుకుంటాయని, అదే తమ పారామిలిటరీ దళాలు కేవలం 10 గంటల్లో భారత రాజధానిని చేరుకుంటాయని చైనా టీవీ ప్రకటించింది.
అయితే చైనా ప్రభుత్వ టీవీ వ్యాఖ్యలు అలా రాగానే భారతీయ నెటిజన్లు చైనా దళాల సామర్థ్యాన్న గేలి చేస్తూ ఆడుకున్నారు. తన దళాలను మోటరైజ్ చేయడానికి మేడ్ ఇన్ చైనా విడిభాగాలను చైనా ఖచ్చితంగా ఉపయోగించి ఉండదని, అలా వాడినట్లయితే హిమలయాల్లోనే వారు కుప్పకూలతారని ఒకరు వ్యాఖ్యం పెట్టారు.
మరొక నెటిజన్ చైనాకు భలే సలహా ఇచ్చేశాడు. ఢిల్లీ సోమనాధ్ భారతి కుక్కలతో, కేజ్రీవాల్ ట్వీట్‌లతో, అశుతోష్ ఇంగ్లీషుతో భద్రత కల్పించబడి ఉంది. రావడానికి అడుగు వేయడానికి ముందు ఒకటకి రెండుసార్లు ఆలోచించు మిత్రమా..