కువైట్‌కు కరోనా భయం.. విదేశీయుల దేశ బహిష్కరణ .. అత్యధికులు తెలుగువారే

శనివారం, 21 మార్చి 2020 (10:00 IST)
ముస్లిం దేశాల్లో ఒకటైన కువైట్‌లో వివిధ రకాల పనుల నిమిత్తం ఇతర దేశాలకు అనేక మంది వెళ్లారు. ఇలాంటి వారిలో ఇతర పోల్చితే మన దేశీయులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువగా తెలుగువారే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ దెబ్బకు కువైట్ తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తికి కువైట్ రాజు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో కువైట్‌లో నివసిస్తున్న విదేశీయులందరినీ అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరిస్తోంది. తాజాగా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశం తరలిస్తోంది. కువైట్ అదుపులోకి తీసుకున్న 350 మందిలో 160 మంది తెలుగువారే కావడం గమనార్హం. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇక, తెలుగువారిలోనూ అత్యధికులు కడప జిల్లావారేనని సమాచారం. ప్రస్తుతం కువైట్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ కువైట్ రాజు ఇచ్చిన అనుమతితో 350 మందితో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం రాత్రి భారత్‌కు బయలుదేరింది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తారు. 
 
ఇదిలావుండగా, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత అదృశ్యమైన యువకుడి జాడ కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన అలీమ్ (26) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. 
 
తాజాగా, స్వగ్రామం వెళ్లేందుకు దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన అలీమ్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. అక్కడి నుంచి మరో విమానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సివుంది. అయితే, మార్గమధ్యంలోనే అతడు అదృశ్యం కావడం కలకలం రేగింది. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి జాడ కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు