ఈ నెల 24వ తేదీన దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇందుకోసం వివిధ రకాల క్రాకర్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను ఢిల్లీ వాసులు మాత్రం ఎలాంటి శబ్దాలు చేయకుండానే జరుపుకోవాల్సివుంటుంది. ఢిల్లీ వ్యాప్తంగా బాణాసంచా పేల్చకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
కాగా, హస్తిలో వాయుకాలుష్యంతో పాటు శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా, దీపావళి సమయంలో కాల్చే మతలాబుల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీంతో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు.