మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్ ప్రొటోకాల్ (ఓజోన్ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది.
ఆ తరువాత 1994, సెప్టెంబర్ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.
లక్ష్యం.
1, పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం.
2 అన్ని దేశాల ప్రభుత్వాలు మాంత్రియల్ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్ పొరను 1980కు ముందున్నస్థాయికి తేవడం
అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం, మొక్కలను పెంచడం, యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం.