కిమ్ జోంగ్ ఉన్ కదలికలపై నిఘా : కదనరంగంలోకి యూఎస్ 'డ్రాగన్ లేడీ' (Video)

మంగళవారం, 22 ఆగస్టు 2017 (10:56 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కాళ్లకు అమెరికా బంధం వేసింది. కిమ్ కదలికలపై నిఘా వేసేందుకు వీలుగా అమెరికా సైన్యం తన అత్యాధునిక యుద్ధ విమానం 'డ్రాగన్ లేడీ'ని రంగంలోకి దించింది. ఉత్తరకొరియా రాడార్లు కనిపెట్టలేనంత ఎత్తులో అంటే సుమారు 70 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అది పహారా కాస్తుంది. 
 
అంటే ఉత్తరకొరియా రాడార్లు కనిపెట్టలేనంత ఎత్తులో అంటే సుమారు 70 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అది పహారా కాస్తుంది. ఈ విమాన ఇప్పటికే జపాన్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిందని అమెరికా సైన్యం తెలిపింది. చాలా ఎత్తులో ఈ విమానాన్ని నడపవలసి ఉండటంతో ఇందులోని పైలెట్లు వ్యోమగాములు ధరించేటటువంటి దుస్తులను ధరిస్తారని అమెరికా సైన్యాధికారులు తెలిపారు.
 
అంతర్జాతీయ ఒత్తిడితోనే ఉత్తర కొరియా దాడిని వాయిదా వేసిందని, దాడిని రద్దు చేసుకోలేదని అమెరికా సైన్యం భావిస్తోంది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించే సమయంలో ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియా తీవ్ర నిర్ణయం తీసుకుంటే ముందుగానే గుర్తు పట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అమెరికా సైన్యం చెబుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఉత్తరకొరియాపై నిఘా కోసం అత్యంత శక్తిమంతమైన కెమెరాలతో పహారా కాసేందుకు డ్రాగన్ లేడీని రంగంలోకి దించామని తెలిపింది. 

 

Flying high with the Dragon Lady. Sometimes she's a dragon, sometimes she's a lady. Learn more about the U-2: https://t.co/sWjF9Dnkz7 pic.twitter.com/FamHKWWw6V

— U.S. Dept of Defense (@DeptofDefense) August 20, 2017

వెబ్దునియా పై చదవండి