ఉద్యోగం ఊడగొట్టిన పాపానికి ఆఫీస్ బిల్డింగ్‌నే కూల్చేశాడు..

సోమవారం, 1 ఆగస్టు 2022 (19:52 IST)
Disgruntled employee
ఉద్యోగం ఊడగొట్టిన పాపానికి ఆఫీస్ బిల్డింగ్‌నే కూల్చివేయడం మొదలెట్టాడు. అసలే కలపతో కట్టిన భవనం.. తుక్కు తుక్కు అవడం మొదలైంది. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని ఒంటారియో నగరంలో ముస్కోసా సరస్సు ఒడ్డున ఉన్న ‘ప్రైడ్ ఆఫ్ రోస్సూ మెరీనా’ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి వ్యవహారమిది. పక్కనే ఉన్న సరస్సులో బోట్‌లో వెళుతున్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
 
"కంపెనీ నుంచి తొలగించిన ఆగ్రహంతో ఓ మాజీ ఉద్యోగి ప్రైడ్ మెరీనా భవనాన్ని ఎక్స్ కవేటర్‌తో కూల్చివేశాడు. నష్టం మిలియన్ డాలర్లలో ఉంటుంది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఇదేదో ఫిక్షన్‌లా అనిపిస్తోంది.." అని వీడియోను పోస్ట్ చేసిన స్థానికుడు పేర్కొన్నారు. ఇక భవనం కూలగొడుతున్న విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. 59 ఏళ్ల మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు.

You can’t make this up. A disgruntled, fired employee from a marina near our lake house snapped and destroyed the entire marina with an excavator. Does anyone have more information on what happened? #Muskoka pic.twitter.com/XcCLAVBFMy

— Don Tapscott (@dtapscott) July 27, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు