మహాత్మాగాంధీని బ్రిటన్ ప్రభుత్వం గొప్పగా స్మరించుకుంది! దీపావళి పర్వదినం పురస్కరించుకుని బాపూజీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణెన్ని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ గురువారం ఆవిష్కరించారు.
ఈ క్రమంలో మహాత్ముడి జీవితాన్ని స్మరించుకుంటూ మొదటిసారి బ్రిటన్ నాణెం రూపొందించడం అద్భుతంగా ఉంది అని వివరించారు. ఈ ఏడాది భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. ఈ స్మారక నాణెం ఇరు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.
రాయల్ మింట్ వెబ్‌సైట్ విక్రయాలు..
హీనా గ్లోవర్ అందించిన ఆకృతిలో రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ ప్రముఖ సూక్తుల్లో ఒకటైన మై లైఫ్ ఇజ్ మై మెసేజ్‌ను పొందుపరిచారు. బంగారం, వెండితోపాటు ఇతర రకాల్లోనూ ఇది అందుబాటులో ఉంది.