బొద్దింకలతో చేసిన బీర్ గురించి విన్నారా? మనదేశంలో కాదు.. జపాన్‌లో బొద్దింకల బీరుకు ఫుల్ డిమాండ్ వుంది. మగ బొద్దింకలను నీళ్లలో కొన్ని రోజుల పాటు ఉడికించి ఆ తర్వాత వాటి నుంచి వచ్చే జ్యూస్‌తో అంటే వాటిని ఉడికించగా వచ్చిన రసంతో బీరును తయారు చేస్తారు.
జపాన్‌లో బీరు తయారు చేసేందుకు ఒక సంప్రదాయమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ పేరు 'కబుటోకామా'. ఈ సంప్రదాయ పద్ధతితో బీరు తయారు చేస్తారు. జపాన్‌లో తైవాన్ మగ బొద్దింకలకుండే డిమాండ్ అంతా ఇంతా కాదు.
సూప్‌లతో పాటు ఇప్పుడు ఆ బొద్దింకలతో బీరు కూడా తయారు చేస్తుండటంతో ఆ బీరుకు జపాన్‌లో ఫుల్ గిరాకీ వస్తోంది. ఆ బీరుకు 'కొంచు సోర్ బీర్' అనే పేరు పెట్టి మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఒక్కో బీరు బాటిల్ మన కరెన్సీలో 300 రూపాయలు ఉంటుంది.